తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సభ ప్రారంభం కాబోతుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని పలు అంశాల్లో ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. నిషేధిత భూముల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్న బీఆర్ఎస్.. అందులో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వ తీరుని ఎండగడుతామని ఇప్పటికే స్పష్టం చేసింది.

అటు బీజేపీ ప్రధానంగా విద్యార్థుల సమస్యలపై ఫోకస్ పెట్టింది. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటోంది. ఈ రెండు పార్టీలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెడీ అవుతోంది. మరోవైపు, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>