కలం, నిర్మల్ : శ్రావణ సోమవారం సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) భైంసా మండలంలోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుంక్లి గ్రామంలోని నాగదేవత ఆలయంలో పూజలు చేసిన అనంతరం సూర్యాపూర్ గ్రామ స్వాగత తోరణాన్ని ప్రారంభించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఓలా గ్రామంలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

