మాజీ మంత్రి కారుమూరికి 14 రోజుల రిమాండ్!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కారుమూరి నాగేశ్వ‌ర్ రావు (Karumuri Nageswara Rao)ను నేడు ఈడీ అధికారులు కోర్టులో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా నాంప‌ల్లి కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 7 వరకు రిమాండ్ కొన‌సాగ‌నుంది. కోర్టులో విచార‌ణ అనంత‌రం కారుమూరిని ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఆదివారం కారుమూరిని అదుపులోకి తీసుకున్నారు. లిక్క‌ర్ స్కామ్ న‌గ‌దు బ‌దిలీల్లో కారుమూరి ప్ర‌మేయం ఉన్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు. కారుమూరి విచార‌ణ అనంత‌రం ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>