సాదాబైనామాలకు పరిష్కారం చూపిస్తాం: మంత్రి పొంగులేటి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ సాదాబైనామా(Sada Bainama) దరఖాస్తుదారులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే సాదాబైనాలకు పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Srinvas Reddy) తెలిపారు.సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా సమస్యలు పరిష్కారమవుతాయని.. ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

అటు తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపట్టి నిర్మాణాలు పూర్తి చేస్తున్న తమ ప్రభుత్వం త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను ప్రారంభించనుందని మంత్రి  పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు లాభం జరగలేదని విమర్శలు గుప్పించారు.

Read Also: అసెంబ్లీలోకి మరో సంచలన బిల్.. రేపు క్యాబినెట్‌లో చర్చ

Follow Us On: Facebook

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>