కలం, వెబ్ డెస్క్ : సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి (Revanth) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీని రూ.750 కోట్లతో 365 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినట్టు తెలిపారు. ‘రైతులు పండించిన చివరి గింజ వరకు కొనాలని, అలాగే సన్నవడ్లకు రూ.500 బోనస్ కూడా ఇచ్చి రైతుల కోసం పాటుపడుతున్నాం. ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకిగా మారినా.. రైతులకు ఇస్తామన్న రైతు భరోసాను పెంచడమే కాదు వాళ్లకు సిద్ధిపేట గడ్డమీద నుంచే నిధులను రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఇప్పుడే 3600 కోట్లు రిలీజ్ చేశాం. రేపే ఈ నిధులు జమ అవుతాయి. మిగిలినవి 45 రోజుల్లోపు పూర్తిగా రిలీజ్ చేస్తాం’ అని సీఎం రేవంత్ (Revanth) వెల్లడించారు.
కేసీఆర్ హయాంలో రైతుల కోసం రూ.2,533 కోట్లు ప్రతి నెలా ఖర్చు పెడితే.. తమ ప్రభుత్వం ప్రతి నెలా రూ.5,500 కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతుందని సీఎం రేవంత్ చెప్పారు. ’28 నెలల్లో రైతుల కోసం లక్షా 40వేల కోట్ల దాకా ఖర్చు పెట్టాం. రైతుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పంటల మార్పిడి తప్పనిసరి. తెలంగాణలో పామాయిల్ పంట 3లక్షల ఎకరాలకు చేరింది. 10లక్షలకు చేరినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని సీఎం రేవంత్ చెప్పారు.
వరి ఒక్కటే పరిష్కారం కాదు..
పాలు, కోడిగుడ్లు, కూరగాయలు కూడా దిగుమతులు చేసుకుంటున్నామని.. తెలంగాణ ఇప్పటికీ చాలా అవసరాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. ‘రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. రైతులకు పండింగే వరి ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండిస్తే కష్టం తక్కువ ఉందని రైతులు పండిస్తున్నారు.. మేం కొంటున్నాం. కానీ ప్రపంంచలోని అన్ని దేశాలకు వడ్లు, బియ్యం సరఫరా చేసిన మన దగ్గర ఇంకా నిల్వలు మిగిలిపోతుఉన్నాయి. ఈ సారి 50 లక్షల ప్యాడీ కంటే ఎక్కువ కొనబోమని.. తెలంగాణలో వడ్లు ఎగుమతులు ఆపాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాదిలో ఇప్పటికే మేం 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మేం కొన్నాం. మరి కొన్న వడ్లను మేం ఏం చేయాలో మీరు ఆలోచించండి’ అని సీఎం చెప్పుకొచ్చారు.
తమ ప్రభుతవ్ం వడ్లను ఎగుమతులు చేసినా, పేదలకు సన్నబియ్యం ఇచ్చినా ఇంకా మిగిలిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘విదేశాలకు వడ్లు ఎగుమతులు చేసినా లాభాలు సరిగ్గా రావట్లేదు. కాబట్టి పంట మార్పిడి తప్పనిసరి. వరి ఒక్కటే కాకుండా మిల్లెట్లు, కూరగాయలు, ఆకుకూరలు, మిరప, పసుపు లాంటివి కూడా పండించాలి. పంట మార్పిడి ద్వారా రైతులను ప్రోత్సహించడానికి సరైన ప్రణాళికలు తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతాం. తెలంగాణలో పంట మార్పిడి ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఒక రూపాయి ఇస్తే, తెలంగాణ ఇంకో రూపాయి కలిపి రెండు రూపాయలు రైతులకు ఇచ్చి ప్రోత్సహించాలి. సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ లో కూడా కట్టాలని తుమ్మల నాగేశ్వర్ రావుకు సీఎం రేవంత్ సూచించారు. పామాయిల్ మంచి లాభసాటి వ్యవసాయం. దీని వల్ల రైతులు ఆర్థికంగా ఆభపడుతారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

