Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో అటవీ శాఖ అధికారుల బదిలీలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటవీశాఖలోని (Telangana Forest Department) ఐఎఫ్ఎస్, ఎస్ఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలతో పాటు పోస్టింగ్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉత్తర్వుల ప్రకారం.. ఎస్. రమేష్‌ను హైదరాబాద్‌లో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (రిసెర్చ్ & డెవలప్మెంట్ సర్కిల్)గా నియమించారు. బి. ప్రవీణను ములుగు ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీన్‌గా పోస్టింగ్ ఇచ్చారు. సీహెచ్. బాలమణిని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేశారు. బొగా నిఖితను వరంగల్ DFOగా నియమించారు.

వికాస్ మీనా ములుగు జిల్లాకు, సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. శివ్ ఆశీష్ సింగ్ మహబూబ్‌నగర్‌కు, రాహుల్ కిషన్ జాదవ్ మంచిర్యాల‌కు పోస్టింగ్ పొందారు. అనుజ్ అగర్వాల్ ఖమ్మం జిల్లాకు, నీరజ్ కుమార్ తిబ్రేవాల్ కామారెడ్డికి బదిలీ అయ్యారు. ఎస్. సత్యనారాయణ రాజన్న సిరిసిల్ల & కరీంనగర్ జిల్లాలకు DFOగా నియమితులయ్యారు. జి. జ్ఞానేశ్వర్‌ను హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్సెస్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>