సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : దశాబ్దాలుగా సామాన్యుడికి సినిమాను చేరువ చేస్తూ, టాలీవుడ్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ‘సింగిల్ స్క్రీన్’ థియేటర్ల (Single Screen Theaters) మనుగడ ప్రస్తుతం తీవ్ర ప్రమాదంలో పడింది. ‘సింగిల్ స్క్రీన్’ థియేటర్ల నిర్వహణ భారంగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘సింగిల్ స్క్రీన్’థియేటర్లలో టికెట్ రేట్లు పెంచబోమని తెలిపింది. ప్రభుత్వం జీవోలు జారీ చేసిన ‘సింగిల్ స్క్రీన్’ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచబోమని స్పష్టం చేసింది. ‘సింగిల్ స్క్రీన్’ థియేటర్లు అంతరించపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శిరీష్‌ వెల్లడించారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం తీసుకున్న తాజా నిర్ణయం సినీ ప్రేక్షకులకు వరంలా మారనుంది. తొలి రోజు విడుదల కానున్న పెద్ద హీరోల సినిమాలను సాధారణ టికెట్ రేటుతోనే చూడొచ్చు.

అంతకుముందు ‘సింగిల్ స్క్రీన్’ థియేటర్ల (Single Screen Theaters) పై తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం నేరుగా టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు ఒక సంచలన విజ్ఞప్తి చేసింది. పాత అద్దె విధానానికి స్వస్తి పలికి, తక్షణమే ‘పర్సంటేజ్ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని కోరింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అద్దె వసూలు చేసే విధానం ఇప్పుడు సింగిల్ స్క్రీన్ యజమానులకు ఉరితాడులా మారిందని ఆరోపించింది. లాభనష్టాలను సమానంగా పంచుకునే ‘పర్సంటేజ్ విధానం’ అయితేనే సింగిల్ స్క్రీన్లు బతుకుతాయని సూచించింది.

Read Also: చక్కెరతో ముసలితనం.. యవ్వనాన్ని హరిస్తున్న తీపి రక్కసి!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>