బండి భగీరథ్ కేసుపై రసమయి బాలకిషన్ ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తనయుడు  బండి భగీరథ్‌ (Bandi Bhagirath) పై నమోదైన పోక్సో కేసు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ జరగకపోవడంపై బీఆర్ఎస్ నేతలు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan), బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, కేసు నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేశారు. సాధారణ వ్యక్తులపై ఇలాంటి కేసులలో వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, ఈ కేసులో మాత్రం ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఐబీ, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థలు ఏమి చేస్తున్నాయని వారు నిలదీశారు. పోక్సో కేసులో ప్రత్యేక అధికారిని నియమించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

సిట్ దర్యాప్తు నిజాలు బయటపెడుతుందా లేక కేసును బలహీనపరుస్తుందా అన్న అనుమానాలు ప్రజలలో ఉన్నాయని పేర్కొన్నారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం సమాచారాన్ని దాచిపెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ కేసులో బండి సంజయ్‌తో పాటు వారి PROపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసును “హనీ ట్రాప్”గా మలచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కేసు దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. కేసు పూర్తిగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలకిషన్(Rasamayi Balakishan) డిమాండ్ చేశారు.

Read Also: బండి భగీరథ్ పోక్సో కేసుపై తెలంగాణ రక్షణ సేన ఆగ్రహం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>