Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : నేడు ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన పామునూరు సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంప్ ను పరిశీలిస్తారు. దీంతో పాటు పోలీస్ ఔట్ పోస్టుకు భూమిపూజ చేయనున్నారు. అలాగే, తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న గుత్తి కోయలతో సమావేశం నిర్వహిస్తారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించి బందోబస్తు చేపట్టారు. కాగా, ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగియడంతో పాటు మావోయిస్టుల నుంచి కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న తరువాత కర్రెగుట్టల్లో డీజీపీ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>