మహిళలే బెటర్.. ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ల పర్ఫామెన్స్‌పై డీజీపీ ప్రశంసలు

కలం, తెలంగాణ బ్యూరో : పోలీస్ డిపార్టుమెంటులో మేల్ ఆఫీసర్లతో పోలిస్తే ఫిమేల్ ఆఫీసర్ల పర్‌ఫార్మెన్స్ చాలా బెటర్‌గా ఉందని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అన్నారు. చాలా విషయాల్లో మహిళా ఆఫీసర్ల పనితీరు ఇంప్రెసివ్‌గా ఉన్నదన్నారు. హైదరాబాద్ నగర 174 ఏండ్ల చరిత్రలో ఒక్క మహిళా అధికారి కూడా స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా నియమితులు కాలేదన్నారు. సిటీ పోలీసు కమిషనర్‌గా తాను పనిచేస్తున్న టైమ్‌లో ఫస్ట్ టైమ్ లాలాగూడ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా మహిళా అధికారిని నియమించానని గుర్తుచేశారు. ఆ తరువాత మరో ఐదుగురిను కూడా నియమించామన్నారు. మహిళా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ప్రస్తుతం 18 మంది డిప్యూటీ పోలీసు కమిషనర్‌లలో తొమ్మిది మంది మహిళలేనని అన్నారు. ఒక డీజీపీగా తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే మేల్ ఆఫీసర్స్ కంటే ఫిమేల్ ఆఫీసర్లే (Women Officers) బెటర్‌గా వర్క్ చేస్తున్నారని అన్నారు.

వెనకవైపు ఉన్నా సీట్ బెల్ట్, హెల్మెట్ కంపల్సరీ

హైదరాబాద్ సిటీ సహా చాలా పట్టణాల్లో రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, ఈ కారణంగానే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్-రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సిటీలో అడిషనల్ ట్రాఫిక్ పోలీసు కమిషనర్‌గా మూడేళ్లు పని చేశానని, వాహనాల రద్దీని స్టడీ చేసిన తర్వాతనే చాలాచోట్ల యూ-టర్న్ పాయింట్లను క్లోజ్ చేసినట్లు గుర్తుచేశారు. రెండువైపులా వాహనాలు సాఫీగా వెళ్ళేందుకే అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నామని, తార్నాక చౌరస్తాలో యూ-టర్న్ లేకుండా చేశామన్నారు. కానీ ఆ తర్వాత ప్రజల నుంచి డిమాండ్ రావడంతో మళ్లీ పెట్టాల్సి వచ్చిందన్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు దగ్గర ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటుందని, అలాంటిచోట్ల యూ-టర్న్ కావాల్సిందేనని, కానీ అవసరం లేనిచోట్ల ఎత్తేశామన్నారు. సిటీ అభివృద్ధికి ట్రాఫిక్ సమస్యలు అవరోధంగా ఉన్నాయన్నారు. బైక్ మీద వెనక కూర్చున్నా హెల్పెట్ తప్పనిసరి అని, కార్లలో వెనకవైపు కూర్చున్నా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందేనన్నారు. యాక్సిడెంట్లలో చనిపోతున్నవారిలో ఎక్కువ మంది వెనకవైపు ఉండేవారేనని అన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ కరెక్టు కాదన్నది నా భావన

సమాజంలో శాంతిభద్రతలు సజావుగా ఉండాలంటే ఎఫెక్టివ్ పోలీసింగ్ అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా అందులో భాగామేనని డీజీపీ వ్యాఖ్యానించారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనే కాన్సెప్ట్ నా దృష్టిలో కరెక్టు కాదు.. పోలీసింగ్ ఎప్పుడూ టఫ్‌‌గానే ఉండాలి.. సంఘ వ్యతిరేక శక్తులు, రౌడీ షీటర్లపై పోలీసులు కఠినంగానే ఉండాలి.. నేరస్తులు, నేర స్వభావం ఉండేవారు పోలీసులతో మర్యాదగా వ్యవహరించరు గదా.. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓకే.. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌తో ఆ కాన్సెప్ట్ అవసరం లేదు..’ అని డీజీపీ అన్నారు. పోలీసు డిపార్టుమెంటులో చేరాలని చాలామంది కోరుకుంటారని, పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఆలోచన, కమిట్‌మెంట్, విజన్ ఉంటే ఫర్వాలేదన్నారు. కానీ ‘డబ్బు సంపాదన, పవర్, స్టేటస్ కోసమైతే చేరొద్దు.. మీకే చెడ్డపేరు వస్తుంది.. కరప్షన్‌కు అలవాటుపడితే ఏదో ఒక రోజు ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకోక తప్పదు. సంపాదనే కావాలనుకుంటే పాన్ షాప్ పెట్టుకుని అయినా బతికేయొచ్చు..’ అని అన్నారు.

ఫిట్‌నెస్ కోసం ‘ఫోర్ వైట్స్’ను దగ్గరికే రానివ్వను

పోలీసు వృత్తిలో ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని, అందుకే తాను ఆ విషయానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని డీజీపీ (DGP CV Anand) అన్నారు. ఈ డిపార్టుమెంటులోకి వచ్చిన తర్వాత 33 ఏళ్ల నుంచి వెయిట్ 75-76 కిలోల మధ్యనే ఉందని గుర్తుచేశారు. ఇప్పటికీ క్రికెట్ ఆడుతూ ఉంటానని, తీసుకునే ఆహారం విషయంలో చాలా స్పష్టమైన డిసిప్లైన్ పాటిస్తానన్నారు. రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌లో షుగర్, మైదా, రైస్, సాల్ట్.. ఈ నాలుగు వైట్స్‌ను కట్ చేశానన్నారు. సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు ‘ఫిట్ కాప్’ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామని, ‘హెల్పింగ్ హ్యాండ్’ అనే మొబైల్ యాప్‌తో పోలీసులందరి హెల్త్ స్టేటస్ తీసుకున్నామని, వారి హెల్త్‌ను మానిటర్ చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నారు. దాదాపు 93 వేల మంది పోలీసు జాబ్స్ మంజూరైతే అందులో 20 వేల ఖాళీలున్నాయన్నారు.

మా దగ్గరా జెన్-జీ, జెన్-ఆల్ఫా థింకింగ్

పోలీస్ డిపార్టుమెంట్‌లో కూడా జెన్-జీ, జెన్-ఆల్పా ఆలోచనలు కనిపిస్తున్నాయన్నారు. జనరేషన్‌తో పాటు సమాజ ధోరణి కూడా మారుతూ ఉంటుందని, గత కొంతకాలంగా డిపార్టుమెంట్‌లో పనిచేస్తూ గమనించానని డీజీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియాతో పాటు చాలా దేశాల్లో జెన్-జీ, జెన్-ఆల్ఫా గురించి వింటున్నానని, ఆందోళనల్లో వారి చొరవను చూస్తున్నానని గుర్తుచేశారు. కొన్ని చోట్ల వారి ఆలోచనలే సంస్థ లేదా ప్రభుత్వ నిర్ణయాలుగా మారుతున్నాయన్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్టుమెంటులో కూడా జెన్-జీ, జెన్-ఆల్ఫా థింకింగ్ రిఫ్లెక్షన్స్ చూస్తున్నామన్నారు. వారి ఆలోచన, ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. ట్రెడిషనల్‌గా, రొటీన్‌గా చూసే కోణానికి జెన్-జీ, జెన్-ఆల్ఫీ డెసిషన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నారు. స్కూళ్లకు వెళ్ళినప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆశ్చర్యమేస్తుందన్నారు.

నేను పక్కా హైదరాబాదీ

“నేను 150 పర్సెంట్ హైదరాబాదీ… పేట్లబురుజు ఆస్పత్రిలో పుట్టాను… నా చదువు, క్రికెట్ అంతా ఇక్కడే.. పోలీసు సర్వీసులో చేరిన తర్వాత ఫస్ట్ పనిచేసింది హైదరాబాద్‌లోనే. తొలి పది సంవత్సరాలు తెలంగాణలోనే.. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పనిచేసి కొంతకాలం కృష్ణా జిల్లాల్లో పనిచేశా. సిబ్బంది సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో మావోయిస్టుల విషయంలో కాస్త రిలీఫ్ కనిపించింది.. కానీ సైబర్ నేరాలు బాగా పెరిగాయి.. నిమిషాల్లోనే కోట్ల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారింది. ‘ఈగల్ ఫోర్స్’ ద్వారా కంట్రోల్ చేస్తున్నాం.. అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు డగ్ర్స్‌పై యుద్ధం చేస్తేనే కంట్రోల్ అవుతుంది.. స్కూల్స్, కాలేజీలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటవుతున్నాయి.. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో డ్సగ్స్ తీసుకునేవారి గురించి తెలిసినా డిపార్టుమెంటు గౌరవం కోసం చెప్పట్లేదు..” అని తన అనుభవాలను పంచుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>