Mobile Popup Ad
Mobile Popup Ad

నల్గొండలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల తాత్కాలిక నిలిపివేత

కలం, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు (JBM Electric Bus) సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ యాజమాన్యం ఈ తాత్కాలిక నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని వివిధ డిపోలలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇటీవల కరీంనగర్, వరంగల్ ఆర్టీసీ డిపోల్లో జేబీఎం విద్యుత్ బస్సుల్లో బ్యాటరీ లీకేజీ కారణంగా బస్సులు దగ్ధమైన ఘటనలు తీవ్ర కలకలం రేపాయి.

ఈ ప్రమాదాల నేపథ్యంలో, జేబీఎం సంస్థ నుండి సాంకేతికపరమైన స్పష్టత, భద్రతా హామీ రాకపోవడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల ప్రాణాల రక్షణే ధ్యేయంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ సర్వీసులను (JBM Electric Bus Services) తాత్కాలికంగా రద్దు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా విద్యుత్ బస్సులను నిలిపివేయడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయంగా సాధారణ బస్సులను ఏర్పాటు చేయాలని, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Read Also: హ‌రీశ్ రావు అరెస్ట్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>