కలం, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగంమరో డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించనున్న డీఈఈసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (DEECET)) హాల్‌టికెట్లను ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిజిటల్ సేవా వేదిక అయిన మీ సేవ” వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ ద్వారా సులభంగా పొందే సౌకర్యాన్ని కల్పించింది. ఈ సౌలభ్యం మే 15 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. డీఈఈసెట్ పరీక్షలు ఈ నెల 21, 22 తేదీల్లో జరుగనున్నాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్ల(DEECET Hall Tickets)ను వాట్సాప్ ద్వారా పొందేందుకు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి.
అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ను మొబైల్‌లో “MeeSeva Telangana” పేరుతో సేవ్ చేసుకోవాలి.
వాట్సాప్ ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపాలి.
అనంతరం “DEECET Hall Ticket” అని టైప్ చేయాలి.
మెనులో కనిపించే “Open Service” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అందులో Payment ID, Application Number, Mobile Number, Date of Birth వివరాలను నమోదు చేయాలి.
వివరాలను సమర్పించగానే హాల్‌టికెట్ వెంటనే వాట్సాప్‌లో అందుతుంది.
ఈ సేవ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు వేగవంతమైన, సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందనున్నాయి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ‘మీ సేవ’ ప్రజా కేంద్రిత సేవలను మరింత విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. ప్రజలకు మరింత సౌలభ్యం, పారదర్శకత, అందుబాటు కల్పించడమే లక్ష్యంగా ఈ సేవలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 2025 నవంబర్ 18న ప్రారంభించిన మీసేవ వాట్సాప్/చాట్‌బాట్ సేవల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రారంభం నుంచే ఈ ప్లాట్‌ఫామ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా జనన సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం, పోలీస్ చలాన్లు, విద్యుత్ బిల్లులు, బీఐఈ ఫలితాల సేవలు అత్యధికంగా వినియోగిస్తున్న సేవలుగా నిలిచాయి. ప్రజలు రోజువారీ పాలన, ప్రభుత్వ సేవల కోసం వాట్సాప్‌ను అధికంగా వినియోగిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవలను డిజిటల్ వేదికల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Read Also: బండి సంజయ్ కొడుకు రేవంత్ ఇంట్లోనే ఉన్నాడు: బక్క జడ్సన్
Follow Us On: Instagram

