కలం, వెబ్‌డెస్క్: పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ (Bandi Bhagirath) వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. బండి భగీరథ్ పరారీలో ఉండగా విచారణకు సహకరిస్తానని సిట్‌కు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జాడ్సన్ (Bakka Jadson) సంచలన వ్యాఖ్యలు చేశారు. భగీరథ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని, పోలీసులు కెమెరాలు పెట్టి వెతకాలని సూచించారు. రేవంత్ రెడ్డి దీనికి సహకరించి భగీరథ్ తన ఇంట్లో లేనట్లయితే రుజువు చేయాలన్నారు. ఒక వేళ ఆయన ఇంట్లోనే ఉంటే రేవంత్ రెడ్డి తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పోక్సో కేసులో ఇరుకున్న బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని బక్క జాడ్సన్ బుధవారం నిరసనకు దిగారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రాత్రి విడుదల చేశారు. పోక్సో కేసు వ్యవహారమే సంచలనంగా మారగా, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే భరీరథ్ ఉన్నాడన్న బక్క జాడ్సన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్ట్ తుది తీర్పు వెలువరించనుంది.

