కలం, వెబ్ డెస్క్: తెలంగాణ టీ20 బ్రాండ్ అంబాసిడర్ హీరో విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపించింది. మరో హీరో విక్టరీ వెంకటేశ్‌తో పాటు క్రికెటర్లు తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకి కూడా జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 లీగ్‌కు బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతి లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. అనేక కార్పొరేట్ కంపెనీలతో కలిసి HCA క్రికెట్‌ను ఫక్తు వ్యాపారంగా మార్చేసిందని ఆరోపించింది. బీసీసీఐ అనుమతి లేని టోర్నీలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని వివరించింది. లీగ్ ప్రారంభించడానికి కనీసం 45 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని, HCA ఆ పని చేయలేదని తెలిపింది.
Read Also: ఆసియన్ గేమ్స్‌పై గురిపెట్టిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్!
Follow Us On: Instagram

