కలం, వెబ్ డెస్క్ : మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ ను విమర్శించిన మంత్రి నారా లోకేష్ కు మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) కౌంటర్ ఇచ్చారు. గతంలో టీడీపీ, జనసేన నాయకులు తమపై విరుచుకుపడలేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను చూపించారు. ”ఆడ కాదు, మగ కాదు ఒక్కొక్కరిని తొక్కిపట్టి నారతీస్తా.. ఎంత మంది వస్తారో రండి కొడకల్లారా” అంటూ పవన్ కళ్యాణ్ తమపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది సంస్కారవంతమైన భాషేనా? అని ప్రశ్నించారు. అంతేకాదు గతంలో లోకేష్ తల్లి భువనేశ్వరిని మీ పార్టీ నేతలు అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు మీ ఈ ‘మర్యాదలు’, ‘సంస్కారాలు’ ఎటు వెళ్లాయి? అప్పుడు ఆమె స్త్రీగా కనిపించలేదా? అంటూ లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు.
ఇదిలాఉంటే పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని, ఆ విషయాన్ని వాడుకుని మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కు ఆ తర్వాత అయిన సంస్కారం వచ్చిందా? అని పేర్ని నాని (Perni Nani) ప్రశ్నల వర్షం కురిపించారు. ”సరే మేమంతా పవన్ కళ్యాణ్ కొడుకులం… ఏదో చేస్తా అన్నావ్ గా… అధికారం వచ్చాక ఏం చేశావ్?!” అని పవన్ కళ్యాణ్ ను తనదైన శైలిలో విమర్శించారు. ఆంధ్రాలో ఓ తల్లి నా కొడుకు కనిపించడం లేదని ఏడ్చినా పట్టించుకొని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. తెలంగాణలో ఎవరో అనారోగ్యంతో ఉన్నారని తెలియగానే వెళ్లి పరామర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. హోం మంత్రి కట్టుబొట్టు గురించి ఎవరు మాట్లాడారని.. ఆమె పాలనపైనే విమర్శలని చెప్పారు.
Read Also: ఏపీలో కొత్తగా వారందరికి పింఛన్లు .. మంత్రి ప్రకటన
Follow Us On: X(Twitter)

