epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గ్లోబల్ సమ్మిట్‌కు కాంగ్రెస్ MLAలు, MPలు దూరం.. ఎందుకంటే?

కలం, వెబ్‌ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులే లక్ష్యంగా ఈ నెల 8, 9 రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్‌ (Global Summit)ను నిర్వహిస్తుస్తున్న విషయం తెలిసిందే. భారత ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. దీంతో పాటు రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు సమ్మిట్ కు హాజరుకావాల్సి ఉంది. అయితే, సర్పంచ్ ఎన్నికల కారణంగా పలువురు ఎమ్మెల్యేలు గ్లోబల్ సమ్మిట్ కు హాజరుకాలేకపోవచ్చునని సమాచారం. పార్లమెంట్ సమావేశాల కారణంగా కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా గ్లోబల్ సమ్మిట్ కు హాజరకాలేకపోతున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. దీని ద్వారా ఫ్యూచర్ సిటీ (Future City)కి ప్రచారం కల్పించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే దేశవిదేశాలను నుంచి సుమారు 2వేల మంది ప్రతినిధులను సమ్మిట్ కు ఆహ్వానించింది. ఇవాళ మధ్యాహ్నాం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) లాంఛనంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit)ను ప్రారంభించనున్నారు.

మరోవైపు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొదలయింది. మూడు విడతల్లో జరిగే ఎలక్షన్లకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 11, 14, 17 వ తేదీల్లో పోలింగ్ జరగనుండగా అదేరోజు కౌంటింగ్ తో పాటు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా జిల్లాల పర్యటనలో రేవంత్ రెడ్డి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

సర్పంచ్ ఎలక్షన్లు ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు. తమతమ నియోజకవర్గాల్లో అత్యధిక సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేలు గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ.. సర్పంచ్ ఎన్నికల్లో ఎలా ముందుకువెళ్లాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు గ్లోబల్ సమ్మిట్ ఉండడంతో ఎమ్మెల్యేలు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామాలను వాళ్లు వదిలిపెట్టి బయటకు వస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని ఆలోచనలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. దీంతో గ్లోబట్ సమ్మిట్ కంటే గ్రామాల్లోనే ఉంటూ సర్పంచ్ ఎన్నికలపై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు సమ్మిట్ కి హాజరవుతారో వేచి చూడాలి.

Read Also: కవిత నెక్ట్స్ టార్గెట్ ఎవరు..?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>