కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) సినీ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట భారత్ ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. తెలంగాణ తల్లికి నివాళులర్పించడం మొదలు వేదిక సందర్శన, స్టాళ్ళన్నీ కలియతిరగడం, గ్రూప్ ఫోటో దిగడం, ఫొటో ఎగ్జిబిషన్ విజిట్.. ఇలా అన్నిచోట్లా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రుల వెంటే ఉన్నారు. నాగార్జునకు ప్రభుత్వం ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడం అక్కడకు వచ్చినవారిలో చర్చకు దారితీసింది. నిన్నమొన్నటివరకూ ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, ఆ తర్వాత సమంత విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అంటీమునట్టుగా ఉన్న నాగార్జున ఇప్పుడు ఒక్కసారిగా ప్రయారిటీ పొజిషన్‌లోకి రావడం గమనార్హం.
హైడ్రా ఫస్ట్ కూల్చింది ఎన్ కన్వెన్షన్ సెంటర్‌నే :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఉనికిలోకి వచ్చిన హైడ్రా (HYDRAA) అక్రమ ఆక్రమణలపై కొరడా ఝళిపించింది. అందులో మొట్టమొదట కూల్చింది అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌నే (N Convention Center). ఆ తర్వాత పలుమార్లు హైడ్రా గురించి చేసిన ప్రస్తావనల్లో ఈ ఇన్సిడెంట్‌ను సీఎం రేవంత్ పదేపదే ప్రస్తావించారు. ఆ తర్వాత నటి సమంత విషయంలో నాగార్జునను టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద కామెంట్లు చేశారు. అది పరువునష్టం దావా వరకూ వెళ్ళింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ తీసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారని, అందులో భాగంగానే మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని నాగార్జునకు క్షమాపణ చెప్పారని, దానితో సంతృప్తి చెందిన నాగార్జున తన పరువునష్టం దావాను వెనక్కి తీసుకున్నారని.. ఇలాంటి చర్చలు జరిగాయి. మొత్తం వివాదం సద్దుమణగడంతో ఇప్పుడు నాగార్జున మరోసారి హైలైట్ అయ్యారు.
Read Also: గ్లోబల్ సమ్మిట్‌కు కాంగ్రెస్ MLAలు, MPలు దూరం.. ఎందుకంటే?
Follow Us On: Instagram


