కలం వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు (Love Marriages) సర్వసాధారణమైపోయాయి. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోతే యువత ధైర్యంగా బయటకెళ్లి పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. కానీ, కొందరు తల్లిదండ్రులు వాటిని తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఇలా తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకోవడంతో ఓ తండ్రి బతికుండగానే ఆమెకు అంత్యక్రియలు (Funeral Rites) చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిశా (Vidisha)లో చోటుకుంది.
కొన్ని రోజులుగా తమ కూతురు కనిపించడం లేదని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం ఆ అమ్మాయి ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తల్లిదండ్రులకు వెల్లడించారు. దీంతో ఆవేదనకు గురైన తండ్రి తన కుమార్తె చనిపోయిందని భావించి, హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. పాడెతో ఊరేగింపు చేసి అనంతరం పిండప్రదానం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బతికుండగానే కూతురికి అంత్యక్రియలు చేయడంపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Read Also: క్లీనర్‌గా మారిన ఇండియన్ సాఫ్ట్‌వేర్.. శాలరీ లక్షకుపైనే!
Follow Us On: Youtube


