కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో త్వరలోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును జాబితాలో చేర్చి, అనర్హుల పేర్లను తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బీఎల్వో సూపర్ వైజర్లు తదితర ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే, సర్ (SIR) ప్రక్రియలో ఐటీ సంబంధిత అంశాలతో పాటు చట్టపరమైన నిబంధనలు, ప్రక్రియలో వివిధ దశలు, విధానాలపై రాష్ట్ర నోడల్ అధికారి పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పలువురు అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితో పాటు సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌పై కన్నేసిన అనాహత్ సింగ్!
Follow Us On : WhatsApp

