కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committee) సమావేశం జరిగింది. డిప్యూటీ భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఈ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి 12 వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల రూపకల్పన, అమలు విధానం, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే అంశాలపై సమీక్ష చేపట్టారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న “ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా” పథకంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించే దిశగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మీటింగ్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

