Mobile Popup Ad
Mobile Popup Ad

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: ఫరూఖ్ షిబ్లీ

క‌లం, వెబ్ డెస్క్‌: ఆవును భార‌త‌ జాతీయ జంతువుగా ప్రకటించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఫరూఖ్ షిబ్లీ (Farooq Shubli) డిమాండ్ చేశారు. మెజారిటీ హిందూ సోదరుల మనోభావాలను గౌరవిస్తూ ముస్లింలు ఆవు వధను పూర్తిగా మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత 12 సంవత్సరాలుగా తాను ఇదే డిమాండ్ చేస్తున్నానని గుర్తు చేశారు. గోసంరక్షణ పేరుతో కేవలం ముస్లింలపై మాత్రమే దుష్ప్రచారం చేయడం తగదన్నారు. మార్కెట్‌లో ఆవులను విక్రయించడానికి తీసుకువచ్చే వారిలో 95 శాతం మంది హిందూ సోదరులే ఉంటారని, అమ్మేవాడు లేకపోతే కొనేవాడు ఎక్కడి నుండి వస్తాడని ఆయన ప్రశ్నించారు. గోరక్షకుల ముసుగులో ముస్లింలపై పడటం ఆగిపోవాలంటే, పశువులను విక్రయానికి తెచ్చే రైతుల వివరాలను బయటపెట్టాలని సూచించారు.

రాబోయే బక్రీద్  (Bakrid) పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఎవరూ కూడా గోవులను కొనుగోలు చేయవద్దని, ఆవు మాంసం తినడం పూర్తిగా పక్కన పెట్టాలని షిబ్లీ (Farooq Shubli) కోరారు. గోవులకు బదులుగా పొట్టేళ్లు, మేకలతోనే పండుగ జరుపుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఆవులను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకువస్తే.. ముస్లిం సోదరులు ఆ దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, చట్టానికి అప్పగించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ఐక్యత, చైతన్యంతో వ్యవహరిస్తేనే ముస్లింలపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందని ఫరూఖ్ షిబ్లీ స్పష్టం చేశారు.

Read Also: హృదయవిదారకం.. తెగిన తల్లి చేయితో పోలీస్ కమిషనరేట్‌కి జవాన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>