Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం.. టీచర్లకూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet) కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలికాగిత రహిత క్యాబినెట్ భేటీ జరిగింది. విద్య శాఖపై చర్చించిన మంత్రి వర్గం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు ఓకే చెప్పింది. ఇప్పటివరకూ విద్యార్థులకు మాత్రమే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అవకాశం ఉన్నది.

ఇప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు, ఆ స్కూల్‌లోని నాన్-టీచింగ్ స్టాఫ్‌కు సైతం అందుబాటులోకి రానుంది. అలాగే, వీబీ జీ రామ్ జీ పథకం అమలు, ఎరువుల పంపిణీ, ఎల్ నీనో పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలు, మూసీ ఫస్ట్ ఫేజ్ పనులకు ఆమోదం లాంటి పలు కీలక అంశాలపై మంత్రి వర్గంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>