కలం, వెబ్ డెస్క్: ఏడాదికి 32 లక్షల ప్యాకేజీ ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఐఐటీ రూర్కీ (IIT Roorkee) గ్రాడ్యుయేట్, డేటా సైంటిస్ట్ అయిన స్నేహ ప్రియకు జీతం కంటే మనశ్శాంతే ముఖ్యం అనిపించింది. అందుకే ఆమె గుర్గావ్‌కు మారే కంటే, బెంగళూరులోనే (Bengaluru) ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బెంగళూరు (Bengaluru)లో దొరికే భద్రత, సొంతిల్లు అనే భావన భారీ ప్యాకేజీ కంటే ఎంతో గొప్పగా అనిపించిందన్నారు. ఈ సందర్భంగా ఇంద్ర ధనస్సు వీడియోను షేర్ చేస్తూ.. “కొన్నిసార్లు కెరీర్ అంటే భారీ ఆఫర్‌ను అందుకోవడం కాదు, మనశ్శాంతిని ఎంచుకోవడం” అంటూ రాసుకొచ్చింది.
ఈ నిర్ణయం వెనుక ముఖ్యంగా భద్రతా కారణాలు ఉన్నాయని స్నేహ తెలిపింది. గతంలో తాను ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi – NCR) ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. అందుకే అంత పెద్ద జీతాన్ని సైతం వదులుకొని అక్కడికి వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సాధారణంగా యువత ఎక్కువ జీతం వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ, స్నేహ ప్రియ తీసుకున్న ఈ నిర్ణయం చర్చకు దారితీసింది. పర్సనల్ సేఫ్టీ, మానసిక ప్రశాంతత, మెరుగైన జీవన ప్రమాణాలు అనేవి డబ్బు కంటే ముఖ్యమైని నెటిజన్లు కూడా ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.
ప్రస్తుత తరం జీతం కంటే జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్నారని స్నేహ ప్రియ (Sneha Priya) జీవితం ఉదాహరణగా చెప్పొచ్చు. ఆమెకు భారీ ప్యాకేజీని వదులుకోవడం అనేది సరైన నిర్ణయం. కెరీర్‌లో సెటిల్ కావడం అంటే.. జీతం మాత్రమే కాదు, ప్రశాంతంగా జీవించగలగడం అని భావించింది.
Read Also: 1500 అడుగుల ఎత్తులో లవ్ ప్రపోజల్.. చివరకు ఏమైందంటే?
Follow Us On : WhatsApp

