కాంచీపురం అమ్మవారి ఉత్సవాల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాంచీపురం (Kanchipuram) అమ్మవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. కంచి కామాక్షి అమ్మవారి ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెండు వర్గాలు పరస్పరం భౌతిక దాడులకు దిగడంతో అల్లకల్లోలంగా మారింది. ఈ గొడవలో ఇద్దరు భక్తులు చనిపోగా.. 20 మందికి పైగా గాయాలయ్యాయి.

ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన రెండు వర్గాలకు చెందిన భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. చిన్నగా మొదలైన గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>