కలం డెస్క్ : సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం(Saudi Bus Tragedy)లో మరణించిన బాధిత కుటుంబాలకు తలా రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం అందించాలని స్టేట్ కేబినెట్ నిర్ణయించింది. చనిపోయినవారి మృతదేహాలకు వారి మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబాలకు చెందిన ఇద్దరి చొప్పున అక్కడకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి మంత్రి అజారుద్దీన్, ఆ శాఖకు చెందిన ఒక అధికారి, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేతో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం సాయంత్రం సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.
Read Also: పాక్‌కు భారత సైన్యాధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us on : Pinterest

