epaper
Monday, November 17, 2025
epaper

పాక్‌కు భారత సైన్యాధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్థాన్‌కు భారత సైన్యాధిపతి(Army Chief) జనరల్‌ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చే దేశాలను భారత్‌ ఒకే దృష్టితో చూస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్‌ రాజీపడబోదని ఆర్మీ చీఫ్‌ తెలిపారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్న ఉగ్ర గ్రూపులకు పాకిస్థాన్‌ మద్దతు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన ద్వివేది, ఉగ్ర ముఠాలను ప్రోత్సహించడం ఆ దేశ అస్థిత్వానికే ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు. చర్చలు, ఉగ్రవాదం కలిసిరావన్నది భారత్‌ స్పష్టమైన అభిప్రాయమని చెప్పారు.

ఆపరేషన్‌ ‘సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌ భూభాగంలో ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి భారత్‌ ప్రపంచానికి ఆధారాలు అందించిందని జనరల్‌ ద్వివేది(Upendra Dwivedi) గుర్తుచేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ, కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయని వివరించారు.

ఉగ్ర సంస్థలు ఇటీవల కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నాయని, డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్మీ చీఫ్‌(Army Chief) తెలిపారు. చైనాతో భారత సంబంధాలు గతంతో పోలిస్తే బలపడుతున్నాయని అన్నారు. సరిహద్దు నిర్వహణపై ఇరుదేశాల మధ్య ఇటీవల ఉన్నతస్థాయి చర్చలు జరిగాయని, శాంతి కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

Read Also: బంగ్లా మాజీ ప్రధానికి మరణ దండన

Follow Us on : ShareChat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>