epaper
Monday, November 17, 2025
epaper

గోషామహల్‌లో కుంగిన ఐదంస్తుల భవనం..

గోషామహల్(Goshamahal) పరిధిలోని చాక్నవాడిలో బుధవారం ఉదయం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఐదంస్తుల భవనం ఒక్కసారిగా కుంగింది. దీంతో స్థానికులు, భవనంలోని వారు వణికిపోయారు. భవనంలోని వారు బయటకు పరుగులు తీశారు. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పక్కనే జరుగుతున్న మరో భవన నిర్మాణం కోసం ఖాళీ స్థలంలో పిల్లర్‌లు వేసేందుకు లోతైన గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న ఐదు అంతస్తుల భవనంలో పెద్ద పగుళ్లు ఏర్పడి భవనం ఒక్కసారిగా కుంగిపోయింది. దీనితో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

భవనం కుంగి దాదాపు ఆరు గంటలు గడిచినా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించలేదని స్థానికులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రమాదం సంభవించే పరిస్థితులున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

భవనం నిర్మాణ లోపాలు, పక్కనే తవ్విన లోతైన గుంతలు కారణంగా భవనం స్థిరత్వం దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, భవనం పూర్తిగా కూలిపోకుండా ముందు జాగ్రత్తగా అక్కడ నివసిస్తున్న నిర్వాసితులను ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Goshamahal | అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, మరో ప్రమాదం సంభవించే అవకాశాలు ఉండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Read Also: సౌదీ మృతులకు రూ. 5 లక్షల పరిహారం

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>