నేడు తెలంగాణ బడ్జెట్.. 6 గ్యారంటీలకు ప్రత్యేక నిధులు?

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలు, సమాధానాల మధ్య శాసన సభ హీటెక్కుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు అత్యంత కీలకం కానుంది. రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) సభలో బడ్జెట్ 2026-2027 (Telangana Budget)ని ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా, అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్ ఉండబోతుందని మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర బడ్జెట్-2026పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏయే రంగానికి ఎన్ని వేల కోట్లను కేటాయించారని దానిపై ఉత్సాహం నెలకొంది. శాసన సభ స్పీకర్ ఆదేశాలతో సభ తొలి సభ్యుడు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ.3.35 లక్షల కోట్లలో తెలంగాణ బడ్జెట్-2026ను రేవంత్ మంత్రివర్గం రూపొందించినట్లు తెలుస్తోంది. గత 2025-26 బడ్జెట్ 3.04 లక్షల కోట్లు. ఇప్పుడు బడ్జెట్ 6.5% పెరిగి దాదాపు 3.25 లక్షల కోట్లకు చేరిందని అంచనా వేస్తున్నారు.

అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందే రాష్ట్ర మంత్రివర్గం (State Cabinet) భేటీ కానుంది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌కి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి, అదే సమయంలో శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఏయే రంగాలకు అధిక ప్రాధాన్యతను సర్కార్ ఇస్తోంది? సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఏ మేరకు ఉంటాయి? కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంటుందా? అనే అంశాలపై విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యం పై ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ పెట్టె ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్షసాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. కాంగ్రెస్ హామీలిచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బడ్జెట్ (Telangana Budget) లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడో సారి బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది.

Read Also: నాలుగు కొత్త స్కీమ్స్.. బడ్జెట్‌లో ఫండ్స్…

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>