నెతన్యాహు నయా ప్లాన్: ఇంధన రవాణాకు కొత్త రూట్!

కలం, వెబ్​ డెస్క్​ : మధ్యప్రాచ్యంలో ప్రస్తుతమున్న ఇంధన రవాణా అడ్డంకులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు అవసరమని ఇజ్రాయెల్ (Israel) ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు (Netanyahu) తెలిపారు. హోర్ముజ్, బాబ్ అల్-మందేబ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో ఎదురయ్యే ముప్పులను తప్పించుకోవడానికి అరేబియా ద్వీపకల్పం గుండా ఇజ్రాయెల్ మధ్యధరా ఓడరేవుల వరకు చమురు, గ్యాస్ పైప్‌లైన్లను నిర్మించడం ఒక ఉత్తమ పరిష్కారమని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాలో ఎదురయ్యే అంతరాయాలను శాశ్వతంగా అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆలోచన మాత్రమే కాదని, ఖచ్చితంగా సాధ్యమయ్యే ప్రాజెక్ట్ అని ఆయన వివరించారు.

అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంపై కూడా నెతన్యాహు (Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామంది అంచనా వేస్తున్న దానికంటే ఈ యుద్ధం చాలా వేగంగా ముగిసిపోతుందని తాను భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాంతీయ భద్రత, ఇంధన రవాణాలో స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోందని నెతన్యాహు  పేర్కొన్నారు.

Read Also: నేడు తెలంగాణ బడ్జెట్.. 6 గ్యారంటీలకు ప్రత్యేక నిధులు?

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>