కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (Telangana Budget 2026) ప్రసంగంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ ప్రభుత్వం ప్రకటించింది.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక విపత్తును నివారించేందుకు ఈ పథకం ఒక రక్షణ కవచంలా పనిచేయనుంది. కులమతాలకు, పేద ధనిక వర్గాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా రక్షణ లభిస్తుంది.
ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశం కూడా ఊహించని రీతిలో, భారీ స్థాయిలో ఈ మహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సరికొత్త భరోసా పథకం 2026, జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది.
Read Also: హైదరాబాద్‌లో 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు
Follow Us On : WhatsApp

