కలం, వెబ్ డెస్క్: సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ లో (Telangana Budget 2026-27) భారీగా కేటాయింపులు చేసినట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం 720 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు. విద్యుత్ సబ్సిడీ కోసం 14 వేల కోట్లను, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కోసం 3683 కోట్లు, స్కాలర్ షిప్స్ కోసం 4323 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల కోసం 5500 కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి పథకం కోసం 4306 కోసం, చేయూత కోసం 14, 861 కోట్లు, గృహ జ్యోతి పథకం కోసం 2080 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్టి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది భట్టి పేర్కొన్నారు.
Read Also: కొత్తగా 274 మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు: భట్టి
Follow Us On: Instagram

