కొత్తగా 274 మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు: భట్టి

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో దివ్యాంగుల మధ్య జరిగే వివాహాన్ని ప్రోత్సహిస్తూ, తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు వీలుగా రూ.2 లక్షల నగదును ప్రజా ప్రభుత్వం కానుకగా అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM) తెలిపారు. ‘స్టేట్ న్యూట్రిషన్ మిషన్’ ద్వారా మన పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ‘ఆధార్‌శిల’ పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకు అత్యుత్తమ ప్రీ-ప్రైమరీ విద్యను ఉచితంగా అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా పాటు రెండు జతల యూనిఫాంలు అందిస్తున్నామని చెప్పారు.

‘బాల భరోసా’ పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలిదశలోనే గుర్తిస్తున్నామని చెప్పారు. దీంతో వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి, భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకు కొండంత ‘భరోసా’ను ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. పాలనా పథకం ద్వారా పని చేసే మహిళల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 అంగన్‌వాడీ కమ్ క్రెచ్ సెంటర్లు (AWCC) ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం తో పాటు, డే-కేర్ సేవలు అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా వృద్ధుల సంక్షేమం కోసం 37 ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లు మంజూరు చేశామని చెప్పారు. ఈ బడ్జెట్లో మహిళ, శిశు సంక్షేమానికి రూ. 3,143 కోట్లను ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>