రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయరంగానికి భారీ కేటాయింపులు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్‌ (Telangana Budget 2026-27)ను ప్రవేశపెట్టారు. ఈ మేరకు రూ.3,24,234కోట్లతో బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అంబేడ్కర్‌ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అమలు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఈ పథకానికి బడ్జెట్‌లో వ్యవసాయం, రైతు సంక్షేమం రూ.23,179 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతు భరోసా కోసం రూ. 18 వేల కోట్లు, రైతులకు బోనస్ ఇచ్చేందుకు 3500 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. పశుసంవర్థక, మత్స్య శాఖకు రూ.1529 కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క్ తన ప్రపంగంలో పేర్కొన్నారు.

Read Also: కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి 5 లక్షలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>