తెలంగాణ బడ్జెట్ : చెవిలో పూలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రొటెస్ట్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Telangana Budget) సమావేశాల సందర్భంగా బీఆర్ ఎస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బడ్జెట్ అంతా ఉత్తదే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ స్పీచ్ ఇస్తున్న సమయంలోనే బీఆర్ ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బడ్జెట్ అంతా మోసమే అని.. రెండు లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, కొత్త పెన్షన్లు ఏమీ లేవంటూ ఆందోళన చేశారు. అనంతరం చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు.

చెవిలో పూలతోనే అసెంబ్లీ బయటకు వచ్చి శాసనసభ ఎంట్రీ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని.. డబ్బా మాటలతోనే కాలం వెల్లదీస్తోందంటూ విమర్శించారు. ఆరు గ్యారెంటీలపై స్పష్టమైన కేటాయింపు చేయకుండా తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శించారు. తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటివేస్తున్నారని.. మైక్ ఇవ్వకుండా తమ గొంతు నొక్కుతున్నారంటూ బీఆర్ ఎస్ నేతలు ఆందోళన చేశారు.

Read Also: గ్లోబల్ టెక్ హబ్‌గా తెలంగాణ: కేటాయింపులు ఇలా!

Follow Us On: Facebook

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>