Mobile Popup Ad
Mobile Popup Ad

బడ్జెట్లో చేనేత రంగానికి రూ.258 కోట్లు: భట్టి

కలం, వెబ్ డెస్క్: మన తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ రంగాలు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయని డిప్యూటీ సీఎం భట్టి (Batti Vikramarka)  విక్రమార్క అన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట్, సిద్ధిపేట్ గొల్లభామ చీరలు, వరంగల్ దుప్పట్లు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు మన సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.

కోటి మహిళలకు కోటి చీరలు కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 70 లక్షల చీరలను అందజేశామని అన్నారు. మిగిలిన చీరలను అతిత్వరలో అందజేయడం జరుగుతుందని చెప్పారు. గతంలో మాదిరి కాకుండా, రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వస్త్రాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో చేనేత రంగానికి 258 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని భట్టి వివరించారు.

Read Also: ఇది విజన్ లేని ఫేక్ బడ్జెట్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>