తెలంగాణ అసెంబ్లీ వాయిదా!

కలం, వెబ్ డెస్క్​ : తెలంగాణ శాసనసభ (Telangana Assembly) సోమవారానికి వాయిదా పడింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వివిధ రంగాలకు చేసిన కేటాయింపులను వివరిస్తూ ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అయితే ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ అంతా అబద్ధాల మయమని, ప్రజలను మోసం చేసేలా ఉందని ఆరోపిస్తూ వారు తమ చెవుల్లో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సభలో ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ తమ అసమ్మతిని తెలిపారు. ఈ గందరగోళం మధ్యే బడ్జెట్ ప్రసంగం ముగియడంతో, స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>