కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 వార్షిక బడ్జెట్ (Telangana Budget) ప్రసంగంలో భాగంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వంటశాలల ఆధునీకరణకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక హాస్టళ్లలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉండటం వల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితులను శాశ్వతంగా చక్కదిద్దేందుకు ఆధునిక వసతులతో కూడిన కిచెన్‌లను (Hi Tech Kitchens) నిర్మించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
వంటశాలల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి, పౌష్టికాహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో వండటానికి ఈ ఆధునీకరణ ప్రక్రియ ఎంతగానో దోహదపడనుంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించింది. దీని ద్వారా అన్ని గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు.
Read Also: గాంధీ మనవడు బీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడ్డారు : సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

