Mobile Popup Ad
Mobile Popup Ad

గాంధీ మనవడు బీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడ్డారు : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ (Revanth) తాజాగా చిట్ చాట్ లో మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు విషయంలో వెనక్కు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలో ప్రజల నుండి అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు వెల్లడించారు సీఎం రేవంత్ (Revanth). నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తామని.. అందుకు తగ్గ ప్లాన్ కూడీ రెడీ అయినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై గాంధీ మనవడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తాను తెలుసుకున్నానని సీఎం పేర్కొన్నారు.

గాంధీ మనవడు కూడా ఈ దేశ పౌరుడే అని.. ఆయన బీఆర్ఎస్ ట్రాప్ లో పడి ఆ ప్రకటన చేసి ఉంటారని సీఎం రేవంత్ చెప్పారు. డ్రగ్స్ అంశంలో ఇంత జరుగుతుంటే బీజేపీ ఎందుకు స్పందించట్లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ ఎస్ వాళ్లను తిడుతుంటే బీజేపీ రియాక్ట్ అవుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటా చేస్తాయో లేదా త్వరలోనే చెప్తానని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>