బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రత్యేక ‘తెలంగాణ బీసీ జేఏసీ(Telangana BC JAC)’ని ఏర్పాటు చేశారు. జేఏసీకి ఛైర్మన్‌గా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను ఎన్నుకున్నారు. వీజీ నారగోని వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బీసీ జేఏసీలో ఆరుగురు సభ్యలతో ముఖ్య కమిటీని కూడా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణ పలు విషయాలు పంచుకున్నారు.
Telangana BC JAC | ‘‘బీసీ నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే కేంద్రంపై ప్రభావం పడుతుంది. 42 శాతం రిషర్వేషన్లలో ఏ అంశంపై కోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక స్టే ఇవ్వకూడదు. బీసీలకు న్యాయం కోసం ఈ నెల 18న బంద్‌కు పిలుపిచ్చాం. అన్యాయాన్ని బీసీలు 76 ఏళ్లుగా భరిస్తున్నారు. బీసీలకు అన్యాయంతో పాటు ఇప్పుడు అవమానం కూడా జరిగింది’’ అని ఆవేద వ్యక్తం చేసారు. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ఉందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
Read Also: కేసీఆర్‌పై విమర్శలపై కేటీఆర్ గరమ్.. గరమ్..

