Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లు.. తెలంగాణ నర్సుల కల సాకారం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనసభలో బుధవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు (TVVP Abolition Bill) ఆమోదం పొందింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) రద్దు బిల్లు ఆమోదం పొందడం ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. గత ముప్పై ఏండ్లుగా నర్సింగ్ ఆఫీసర్స్ ఆరోగ్య సిబ్బంది కలలుకంటున్న మార్పు నేడు సాకారమైందన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి, దానిని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (DSHS) గా అధికారికంగా మార్చే బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం గొప్ప విషయమన్నారు.

ప్రభుత్వం టీవీవీపీని రద్దు చేయడం ద్వారా సెకండరీ హెల్త్‌కేర్ సేవలు మరింత బలోపేతం కానున్నాయి. నర్సింగ్ ఆఫీసర్స్, ఉద్యోగుల వేతనాలు, ప్రమోషన్లు, సర్వీస్ సంబంధిత సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనరసింహకు, ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్) క్రిస్టియానా జడ్ చోంగ్తుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>