స్కూల్ వ‌ర్కింగ్ డేస్‌పై సీఎంకు ఎమ్మెల్సీ లేఖ‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎమ్మెల్సీ మ‌ల్క కొముర‌య్య (MLC Malka Komaraiah) సీఎం రేవంత్ రెడ్డికి శ‌నివారం ఓ లేఖ రాశారు. ఈ లేఖ‌లో స్కూల్స్ వ‌ర్కింగ్ డేస్‌పై సీఎంకు కీల‌క‌ విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో నేప‌థ్యంలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతాయ‌ని, ఈ నేప‌థ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే స్కూల్స్ పని చేసేలా చూడాల‌ని కోరారు. ఆదివారం సెల‌వుతో పాటు శనివారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని రిక్వెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటం, వర్షాలు స‌రిగా ప‌డ‌క‌పోవ‌డం, నీటి వనరులపై ఒత్తిడి పెరగనున్న నేపథ్యంలో ఈ విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల స్కూల్స్‌లో తాగునీటి వినియోగం, విద్యుత్‌ వినియోగం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌, పొల్యూష‌న్ కూడా తగ్గుతాయని తెలిపారు.

అలాగే అధిక ఉష్ణోగ్రతల సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని మల్క కొమురయ్య అభిప్రాయపడ్డారు. శనివారం కోల్పోయే వ‌ర్కింగ్ డేను భర్తీ చేసేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 35 నుంచి 40 నిమిషాల పాటు పాఠశాలల పనివేళలను పొడిగించవచ్చని సూచించారు. తద్వారా విద్యార్థులపై అదనపు భారం పడకుండా నిర్దేశిత సిలబస్‌ను పూర్తి చేయవ‌చ్చ‌న్నారు. దీనిపై సీఎం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>