పదోన్నతి పొందిన గణేష్‌కు ఘనంగా వీడ్కోలు.

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించిన గణేష్‌కు పదోన్నతిపై ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్) సూపరింటెండెంట్‌గా బదిలీ కావడంతో శనివారం కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సన్మానం (Farewell Ceremony) నిర్వహించారు. ఈ సందర్బంగా గణేష్ సేవలను కొనియాడుతూ శాలువా, పూలమాల, జ్ఞాపికతో సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు. గంగాధర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగ శ్రీనివాస్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>