పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై స్పందించిన ధనుష్​!

కలం, వెబ్ డెస్క్: హీరో ధనుష్ (Actor Dhanush) తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, ధనుష్‌కు బీజేపీ మద్దతు ఉందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తనకు దిశానిర్దేశం చేసేది భగవంతుడేనని, తన వెనుక అభిమానులు, ప్రజలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. తన తాజా చిత్రం ‘ఓం’ ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా, ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పేరును ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించినట్లు కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా, తమిళనాడు వ్యాప్తంగా సుమారు 3 వేల మంది న్యాయ సలహాదారులను నియమించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజలు ఎదుర్కొంటున్న చట్టపరమైన, సామాజిక సమస్యలకు న్యాయ సలహాలు అందించాలనేది ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశమని ప్రచారం జరుగుతోంది. అయితే, రాజకీయ ప్రవేశంపై ధనుష్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>