ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, ఉట్నూరు: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Bojju Patel) అన్నారు. శనివారం ఉట్నూరు మండలం మత్తడిగూడలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో (Dandari Celebrations) ఐటీడీఏ పీవో మంద మకరంద్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో దండారీలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రూ.15 వేలకు పెంచిందన్నారు.

పారదర్శకత కోసం నేరుగా దండారీలకే చెక్కులు అందిస్తున్నామని, ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక షెడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించడమే లక్ష్యమని, వెయ్యి మంది దండారీలతో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>