కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం సలహాదారు కే. కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్ష సమావేశం (All Party Meeting) జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, టీడీపీ, తెలంగాణ జన సమితి, ఆప్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీకి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు, స్పీకర్ మీరా కుమార్, పలువురు ముఖ్యులకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఉద్యమకారుల గుర్తింపుకు అఖిలపక్ష పార్టీలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

