Mobile Popup Ad
Mobile Popup Ad

దేశంలో మరో సంచలన స్కాం.. ఏకంగా 15 లక్షల కోట్లు!

కలం, వెబ్ డెస్క్ : దేశంలో మరో సంచలన ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బంగారం కంపెనీ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ (Rajesh Exports) ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల మేర భారీ స్కామ్‌కు పాల్పడినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) గుర్తించింది. గత ఐదేళ్ల కాలంలో (2020-2025 మధ్య) కంపెనీ తన ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తూ, కేవలం కాగితాలపైనే దాదాపు రూ.15 లక్షల కోట్ల ఎగుమతులను చూపించింది. వాస్తవానికి అక్కడ ఎలాంటి బంగారం అమ్మకాలు కానీ, ఆభరణాల వ్యాపారం కానీ జరగలేదని దర్యాప్తులో తేలింది. కంపెనీ చూపించిన మొత్తం గ్రూప్ ఆదాయంలో దాదాపు 99.8 శాతం ప్రాఫిట్స్ పూర్తిగా నకిలీవని సెబీ నిర్ధారించింది. ఈ నిధుల అవకతవకలకు తోడు, కంపెనీ డబ్బును ప్రమోటర్లు తమ సొంత ట్రేడింగ్ కోసం వాడుకున్నట్లు ఆరోపణలు రావడంతో, కంపెనీ సీఎండీ రాజేశ్ మెహతాపై సెబీ మార్కెట్ ట్రేడింగ్ నిషేధం విధించింది.

ఈ మహా కుంభకోణం ప్రభావం దేశంలోని సామాన్య ప్రజలపై తీవ్రంగా పడనుంది. దేశంలో కోట్ల మంది నమ్మకాన్ని కలిగిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఈ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో 10.80 శాతం వాటాను కలిగి ఉంది. మార్చి 2026 నాటికి ఎల్‌ఐసి వద్ద ఈ కంపెనీకి చెందిన సుమారు 3,18,75,887 షేర్లు ఉన్నాయి. సెబీ చర్యల అనంతరం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (Rajesh Exports) షేరు విలువ ఏకంగా 80 శాతం వరకు పడిపోయింది. ఈ ఏడాది జూన్ 4 నాటికి షేరు ధర రూ.104 నుండి రూ.105 స్థాయికి పడిపోవడంతో, ఎల్‌ఐసి హోల్డింగ్స్ విలువ కేవలం ఆరు నెలల్లోనే రూ.637 కోట్ల నుండి రూ.347 కోట్లకు క్షీణించింది. దీనివల్ల ఎల్‌ఐసికి రూ.290 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) గత మూడేళ్లుగా ఈ కంపెనీలో తమ వాటాలను తగ్గించుకుంటూ వస్తున్నప్పటికీ, అనేక వివాదాలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు ఉన్నా కూడా ఎల్‌ఐసి తన పెట్టుబడులను అలాగే కొనసాగించడం ఇప్పుడు అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>