Mobile Popup Ad
Mobile Popup Ad

వెంక‌న్న‌ ఆల‌యంలో టీడీపీ మ‌హానాడు!

క‌లం, వెబ్‌డెస్క్‌: అన‌కాప‌ల్లి (Anakapalli)లో జ‌రుగుతున్న టీడీపీ మ‌హానాడు (TDP Mahanadu) వివాదాస్ప‌దంగా మారింది. బుచ్చ‌య్య‌పేట‌లోని వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో టీడీపీ నేత‌లు మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం స్థానికంగా తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. భ‌క్తుల ప్రార్థ‌న‌ల‌కు ఆటంకం క‌లిగిస్తూ, ఏకంగా దేవాల‌యానికి తాళం వేసి మ‌రీ ఈ రాజ‌కీయ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డంపై భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆల‌యం ప్రాంగ‌ణ‌మంతా టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌తో నింపేశారు. ఇక ఆల‌యంలో లోప‌లే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఉంచి నివాళులర్పించడం చర్చనీయాంశమైంది.

ప‌విత్ర‌మైన‌ గ‌ర్భాల‌యం ముందు భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి మ‌హానాడు ప్ర‌సంగాల‌ను వీక్షించ‌డం ప‌ట్ల ఆధ్యాత్మిక‌వేత్త‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఆల‌యాల‌ను వాడుకోవ‌డం స‌రికాద‌ని మండిప‌డుతున్నారు. దేవాల‌యంలో ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు అధికారులు ఎలా అనుమ‌తించార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వెంక‌న్న ఆల‌యంలో జ‌రిగిన‌ మ‌హానాడు (TDP Mahanadu) కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Read Also: ఆ ఎమ్మెల్యేతో ప్రాణ‌హాని ఉంది.. టీడీపీ నేత సంచ‌ల‌న వీడియో!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>