నోయిడాలో అగ్ని ప్రమాదం: ఇద్దరు యువతులు మృతి!

కలం, వెబ్ డెస్క్ : నోయిడాలోని మామురా గ్రామంలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ భవనంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జింగ్ పెడుతున్న సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన అగ్నిప్రమాదం (Noida Fire) సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్యాటరీ ఓవర్‌హీట్ అయి పేలడం లేదా షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు అక్కడ పార్కింగ్ చేసి ఉన్న సుమారు 10 వాహనాలు క్షణాల్లోనే పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

పార్కింగ్ స్థలంలో మొదలైన ఈ మంటలు వేగంగా భవనం పై అంతస్తులకు వ్యాపించాయి. ఆ సమయంలో దట్టమైన పొగ, మంటలు చుట్టుముట్టడంతో భవనంలో ఉన్న ఇద్దరు యువతులు ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా పీజీ (పేయింగ్ గెస్ట్) వసతి గృహాన్ని నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం  (Noida Fire) జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అసలు కారణాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: బరువు తగ్గడానికి ఖర్జూరం vs బెల్లం ఏది మంచిది? నిపుణులు చెప్పిన నిజాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>