కలం, వెబ్ డెస్క్ : నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ (NEET Paper Leak) కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. ఈ మేరకు లాతూర్‌కు చెందిన డాక్టర్ మనోజ్ శిరూరేను, పూణేకు చెందిన కోచింగ్ సెంటర్ డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ (APMA) ఫిజిక్స్ ఫ్యాకల్టీ తేజస్ హర్షద్‌కుమార్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి మొత్తం సంఖ్య 13కి చేరింది.
కాగా, నిందితుడైన కోచింగ్ సెంటర్ యజమాని కుమారుడితో సహా ముగ్గురు నిందితులను, నిందితుడైన పి.వి. కులకర్ణి నుంచి కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలను పొందడంలో డాక్టర్ మనోజ్ శిరూరే కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అధికారులు తేల్చారు. అటు అరెస్టైన నిందితురాలు మనీషా హవాల్దార్ నుంచి తేజస్ హర్షద్‌కుమార్ నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన లీకైన (NEET Paper Leak) ఫిజిక్స్ ప్రశ్నపత్రాన్ని పొందినట్లు వెల్లడైంది. ఈ కేసులోని కుట్రను వెలికితీసేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. పరీక్షకు ముందు పంపిణీ చేయబడిన కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ప్రశ్నపత్రాల లీకేజీకి అసలు మూలాన్ని వెలుగులోకి తెచ్చింది.
Read Also: ‘ప్రభుత్వం మారింది.. అందుకే బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతున్నాం’
Read Also: డిజిటల్ విప్లవం

