కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఇచ్చే రాయల్ విందుపై చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు ప్రశంసలు కురిపిస్తుంటారనే విషయం తెలిసిందే. ఇదే కోవలో తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా ప్రభాస్ ఇచ్చే విందులపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పేరు చెప్పగానే తనకు భోజనమే గుర్తొస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రభాస్ తో రాధేశ్యామ్ చేసినప్పటి మెమొరీస్లలో తనకు ఎక్కువగా గుర్తొచ్చేది భోజనమేనని పూజా హెగ్డే (Pooja Hegde) అన్నారు. రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ప్రభాస్ సెట్స్‌లో ప్రతి ఒక్కరికీ ఎంతో రుచికరమైన, నోరూరించే వంటకాలను తినిపించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఇంటి నుంచి వచ్చే క్యారేజ్ డబ్బాల రుచి అద్బుతమని కొనియాడారు. ప్రభాస్ ఇంటి నుంచి భోజనానికి తాను ఫిదా అయిపోయాన్న పూజా హెగ్డే.. ఒకవేళ తనకు గనుక అవకాశం వస్తే మాత్రం ప్రభాస్ దగ్గర పనిచేసే కుక్‌ని దొంగిలిస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రభాస్ ఆతిథ్యంపై పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also: బరువు తగ్గడానికి ఖర్జూరం vs బెల్లం ఏది మంచిది? నిపుణులు చెప్పిన నిజాలు
Follow Us On : WhatsApp

